: తెలంగాణ గిరిజన బాలికను అభినందించిన అమితాబ్ బచ్చన్


భారతదేశం గర్వించే నటుడు అమితాబ్ బచ్చన్ తెలంగాణ గిరిజన బాలికను అభినందించారు. 13 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలోతు పూర్ణ.. జీవిత కథ ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు, రగ్బీ ఆటగాడు రాహుల్ బోస్ పూర్ణ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన అమితాబ్ పూర్ణను అభినందించారు. కేవలం 13 ఏళ్ల వయసులో ఎవరెస్టు మహా శిఖరాన్ని అధిరోహించడం చిన్న విషయం కాదని అన్నారు. ఈ సినిమాను అంతా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ బోస్ ను ఆయన అభినందించారు. రాహుల్ బోస్ ఒక మంచి కథను ఎంచుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పూర్ణతో అమితాబ్ సెల్ఫీ దిగి తన ఖాతాలో పోస్టు చేశారు. 

  • Loading...

More Telugu News