: చంద్రబాబు ఏకైక మగాడు... బహుమతివ్వాలనుందంటూ ముఖ్యమంత్రిని ముద్దాడిన రాజేంద్ర ప్రసాద్
దేశంలో నదులను అనుసంధానం చేసిన ఏకైక మగాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, అంతటి ఘనత సాధించిన చంద్రబాబుకు ఏదైనా బహుమతి ఇవ్వాలని ఉందని అన్నారు. అనంతరం నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ ఆయనను ఆలింగనం చేసుకుని ఆయన బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు. దీంతో అంతా క్లాప్స్ కొట్టి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన తొలి ఉగాది వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అమరావతి రాజధానిని చంద్రబాబు అద్భుతంగా నిర్మిస్తారని ఆయన పేర్కొన్నాడు.