: స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి పనికిరాడు: ఆసీస్ మాజీ స్పిన్నర్ కెర్రీ ఒకీఫ్


ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి పనికిరాడని ఆ దేశ మాజీ స్పిన్నర్ కెర్రీ ఒకీఫ్ అభిప్రాయపడ్డాడు. భారత్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో పరాజయం పాలవ్వడం, జట్టు ఆటతీరుపై మండిపడ్డ ఒకీఫ్... స్మిత్ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడని అన్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనై ఓవర్ యాక్షన్ చేశాడని విమర్శించాడు.

ఆస్ట్రేలియా జట్టును స్మిత్ ముందుండి నడిపించాడనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పిన ఒకీఫ్...అయితే ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా కొనసాగగలిగే భావోద్వేగ స్థిరత్వాన్ని అతను ప్రదర్శించాడా? అన్నదే ప్రశ్న అని ఆయన అభిప్రాయపడ్డాడు. స్మిత్ లో ఆసీస్ అంతటి జట్టుకు కెప్టెన్ గా కొనసాగే భావోద్వేగాలను ప్రదర్శిచండం లేదని చెప్పాడు. తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతున్నాడని, తీవ్రమైన ఆగ్రహానికి లోనవుతున్నాడని ఇది సరికాదని ఆయన హితవు పలికాడు. 

  • Loading...

More Telugu News