: శివసేన ఎంపీ గైక్వాడ్ కు జర్నీ ట్రబుల్స్.. పూణే నుంచి ఢిల్లీకి కారులో ప్రయాణం!
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు. ఎయిరిండియా ఉద్యోగిపై దాడికి నిరసనగా ఆయనపై విమానయాన సంస్థలన్నీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రయత్నాలు మానలేదు. జనరల్ కేటగిరీలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఆయనను గుర్తించిన విమానయాన సంస్థలు ఆయన టికెట్లు రద్దు చేశాయి. దీంతో రాజధాని ఎక్స్ ప్రెస్ లో డిల్లీ వెళ్దామని భావించిన ఆయన మనసు మార్చుకుని, ఢిల్లీకి భార్యతో కలిసి కారులో బయల్దేరారు. ఈ విషయాన్ని ఉమర్గా పట్టణానికి చెందిన ఆయన స్నేహితుడు నిర్ధారించారు. కాగా, పూణే నుంచి నేటి మధ్యాహ్నం బయల్దేరిన ఆయన రేపు సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్నారు.