: త్వరలోనే పెళ్లి పీటలెక్కుతానంటున్న అలియా భట్
ప్రముఖ బాలీవుడ్ యువనటి అలియా భట్ త్వరలోనే పెళ్లి పీటలెక్కుతానని చెబుతోంది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న అలియా... ఇప్పుడు కొంత మంది హీరోయిన్లు వివాహం చేసుకుంటున్నట్టు 30 ఏళ్ల వరకు ఆగాలని తాను భావించడం లేదని చెప్పింది. అలా ఆలస్యంగా వివాహం చేసుకున్నవారంతా సమస్యలు ఎదుర్కొంటున్నారని, తాను అలాంటి సమస్యలు ఎదుర్కోవాలని భావించడం లేదని చెప్పింది. త్వరగానే వివాహం చేసుకుంటానని చెప్పింది.
సినిమాల్లోకి కూడా తాను చిన్నవయసులోనే వచ్చానని, అందువల్ల చాలా ప్రయోజనాలు పొందానని చెప్పింది. అలాగే తొందరగా వివాహం చేసుకుని ఆ ప్రయోజనాలు కూడా పొందుతానని చెప్పింది. త్వరగా వివాహం చేసుకున్నా సినిమాలకు దూరం కానని చెప్పింది. బెబో వివాహం చేసుకుని బిడ్డను కన్నా సినిమాలకు దూరం కాలేదని, త్వరలోనే ఓ సినిమాలో నటించనుందని అలియా పేర్కొంది. తాను కూడా అలాగే చేస్తానని చెప్పింది. అయితే ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని తెలిపింది. కాగా, అలియా భట్ సిద్ధార్థ్ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.