: చెన్నైలోని మెరీనా బీచ్ లో మళ్లీ ఉద్రిక్తత


చెన్నైలోని మెరీనా బీచ్ తీరం మరో ఉద్యమానికి సాక్షిగా నిలుస్తోంది. గతంలో జల్లికట్టు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేందుకు సాక్షిగా నిలిచిన మెరీనా బీచ్ లో విద్యార్థులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జలదీక్షగా చేపట్టిన ఈ ఉద్యమం... చెన్నైలో ఏర్పాటు చేయనున్న హైడ్రోకార్బన్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ చేపట్టారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల రాష్ట్ర ప్రజలకు ముప్పు ఏర్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ ప్రాజెక్టు అనుమతులను ఉపసంహరించుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో మరో జల్లికట్టు ఉద్యమాన్ని చవిచూడాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు. వారిని నియంత్రించేందుకు ప్రభుత్వం బలగాలను మోహరించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

  • Loading...

More Telugu News