: నిజజీవితంలో 'బామ్మమాట బంగారు బాట' సినిమాలోని సీన్.. బాలుడి ఊపిరితిత్తులలో విజిల్ ను గుర్తించిన వైద్యులు!


రాజేంద్రప్రసాద్, గౌతమి జంటగా భానుమతి రామకృష్ణ, నూతన్ ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన 'బామ్మ మాట బంగారు బాట' సినిమా చూశారా? అందులోని ఓ సన్ని వేశంలో నూతన్ ప్రసాద్ భార్యపై భయంతో విజిల్ మింగేస్తాడు. ఆ తరువాత ఏం మాట్లాడినా విజిల్ సౌండ్ మాత్రమే వస్తుంది. అచ్చం అలాగే హైదరాబాదులో ఓ బాలుడి నోటి నుంచి వింత శబ్దాలు వస్తుండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలుడ్ని హైదరాబాదులోని వివిధ ఆసుపత్రులు తిప్పారు. అయితే ఆ శబ్దాలు ఎందుకు వస్తున్నాయో అంతు చిక్కకపోవడంతో చివరకు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ స్కాన్ చేసిన వైద్యులు బాలుడు విజిల్ మింగేశాడని, అది అతని ఊపిరితిత్తుల్లో చిక్కుకుపోయిందని, దాని వల్లే అతని నోటి నుంచి చిత్ర విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయని గుర్తించారు. దీంతో రెండు గంటలపాటు శ్రమించిన వైద్యులు బాలుడి ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న విజిల్ ను విజయవంతంగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. 

  • Loading...

More Telugu News