: పెరూలో ల్యాండ్ అవుతుండగా విమాన ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం!


పెరూలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పెరూ అధికారిక విమానయాన సంస్థ పెరూవియన్ కు చెందిన బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతుండగా గేర్ లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల రన్ వే పై పక్కకి ఒరిగిపోయింది. దీంతో క్షణాల్లో విమానాన్ని మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానంలో ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్స్ ద్వారా కిందికి దించేశారు. ఈ సమయంలో విమాన సిబ్బంది సహా 141 మంది ఉన్నారని, మంటలు క్యాబిన్ వరకు విస్తరించే లోపు వీరు కిందికి దిగేయడంతో ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే విమానం మాత్రం మంటల్లో కాలి బూడిదైంది. 

  • Loading...

More Telugu News