: మైక్ టైసన్ ను కలిశాను.. ఆయన ఒక్కటే చెప్పాడు!: విక్టరీ వెంకటేష్


'గురు' సినిమా మూడేళ్ల క్రితమే తన వద్దకు వచ్చిందని విక్టరీ వెంకటేష్ తెలిపాడు. 'గురు' సినిమా విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, తాను అనారోగ్యంతో ఉండడంతో అప్పట్లో ఈ సినిమాను అంగీకరించలేదని గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమా దర్శకురాలు తెలుగు మహిళే కావడంతో షూటింగ్ చాలా సులువుగా గడిచిపోయిందని అన్నాడు. ఈ సినిమా కోసం చాలా శ్రమపడ్డానని తెలిపాడు. ఆరు నెలలపాటు బాక్సింగ్ నేర్చుకున్నానని అన్నాడు.

పాత్ర పోషించే ముందు ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ను కలిశానని అన్నాడు. ఆ సమయంలో టైసన్ విలువైన సలహాలు ఇచ్చాడని వెంకీ చెప్పాడు. ప్రధానంగా ఆటలో కోచ్ ప్రభావం ఎంత మేలు చేసిందో వివరించాడని అన్నాడు. తన కోచ్ తో విభేదాలు రావడంతో తన నుంచి కోచ్ దూరంగా వెళ్లాడని, దీంతోనే తాను ఓటమిపాలయ్యానని చెప్పాడని అన్నాడు. కోచ్ లేకపోతే మనం ఏం చేస్తున్నామో తెలియదని, చేసే ప్రతీదీ సరిగ్గానే అనిపిస్తుందని టైసన్ తెలిపాడని, కోచ్ లేకుండా ఏదైనా ఆడడం అసాధ్యమని చెప్పాడని వెంకీ గుర్తుచేసుకున్నాడు. 

  • Loading...

More Telugu News