: తండ్రిపై రాజకీయ కక్ష... కుమార్తెపై ఐదుగురు వ్యక్తుల దాష్టీకం!


రాజకీయ కక్ష తీర్చుకునేందుకు శత్రువులు కుమార్తెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఒడిశాలో పెనుకలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... ఒడిశాలోని గంజాం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆశిష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... గంజాం జిల్లాలోని ఓ గ్రామానికి ఈ మధ్యే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ వ్యక్తి తమకు వ్యతిరేక వర్గానికి మద్దతిచ్చాడని కక్ష పెంచుకున్న ఒక వర్గం... అతని కుమార్తెను మార్చి 9న అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా, కిడ్నాప్ చేశారు. అనంతరం దగ్గర్లోని అడవిలోకి తీసుకెళ్లి నిర్బంధించి 9 రోజులపాటు ఆమెపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో సోదరుడి వరసయ్యే వ్యక్తి కూడా ఉండడం విశేషం. స్థానిక పోలీసులపై నమ్మకం లేని ఆ తండ్రీ కుమార్తెలు నేరుగా గంజాం ఎస్పీ ఆశిష్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఆయన బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News