: నేను రాష్ట్రపతి పదవి రేసులో లేను... అన్నీ పుకార్లే!: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్


రాష్ట్రపతి రేసులో తాను లేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ కోసం మాత్రమే తాను పనిచేస్తానని అన్నారు. ఆర్ఎస్ఎస్‌ లో చేరేముందే తాను అన్ని తలుపులు మూసేశానని ఆయన చెప్పారు. రాష్ట్రపతి రేసులో ఉన్నానని వస్తున్న వార్తలన్నీ వదంతులేనని ఆయన స్పష్టం చేశారు. అలా కాకుండా ఎవరైనా పొరపాటున తన పేరు ప్రతిపాదించినా దానికి తాను అంగీకరించనని ఆయన తెలిపారు. దేశంలో హిందూ రాజ్యానికి బాటలు వేయాలంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను రాష్ట్రపతిని చేయాలని... రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు ఇలా ప్రధాన పదవుల్లో అంతా హిందువులే ఉంటే... దేశాన్ని హిందూదేశంగా తీర్చిదిద్దడం పెద్ద కష్టం కాదని శివసేన అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News