: ఒక తెలంగాణ నాయకుడికి ప్రమాదం పొంచి ఉంది.. ఉగ్రవాదుల చర్యలు పెరిగే అవకాశం ఉంది!: పంచాంగకర్త సంతోష్ కుమార్


హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ లో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రచాంగ శ్రవణం జరిగింది. ప్రముఖ పంచాంగకర్త సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు.

ఈ ఏడాది తెలంగాణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా పంచాంగకర్త తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఒక నాయకుడికి ప్రమాదం పొంచి ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భారీ కుంభకోణాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 

  • Loading...

More Telugu News