: హేవళంబిలో ఫలితాలు ఎలా ఉంటాయంటే..!


విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో భాగంగా హేవళంబి నామ సంవత్సరంలో ఫలితాల గురించి ప్రముఖ పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి తెలియజేశారు. ‘‘ఇది 31వ సంవత్సరం. అధిపతి అగ్నిదేవుడు. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఏదైనా గొప్ప ప్రాజెక్టు చేపడితే విజయవంతంగా పూర్తవుతుంది. అగ్ని దేవుడు అధిపతిగా ఉండడం వల్ల నువ్వులతో దానం చేస్తే సకల దోషాలు పోతాయి. లేదా నువ్వులను ఉండగా చేసి ఆవులకు పెడితే అనుకోని ఇబ్బందులు వస్తే తొలగిపోతాయని శాస్త్ర ప్రమాణం. బుధుడు రాజుగా ఉండడం వల్ల పంటలు చక్కగా పండుతాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి.

మంత్రి శుక్రుడు కావడం వల్ల అద్భుతంగా ప్రభుత్వం పనిచేస్తుంది. పంటలకు తగిన వర్షాలు లభిస్తాయి. ధనధాన్య వృద్ధి గురుడి వల్ల లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వరస్వామికి విశేషమైన సేవలు జరిగి ఆ కృప మనపై ఉంటుంది. చంద్రుడు సస్యాధిపతిగా ఉన్నాడు. పంటలకు లోటు లేదు. ఒకవేళ వర్షాలు తగ్గినా మాగాణి, మెట్ట పంటలు చక్కగా పండుతాయి. ధాన్యాధిపతి శని. మినుములు, నువ్వులు బాగా పండుతాయి. రసాధిపతి కుజుడు. జీలకర్ర, బెల్లానికి గిట్టుబాటు ధరలు లభిస్తాయి. నీర్సాధిపతి సాక్షాత్తూ సూర్య భగవాడు. బంగారం వెండి, పంచలోహాలు మణులు బాగా వ్యాప్తం అయ్యి అవకాశాలను కలుగజేస్తాయి. తొమ్మిది గ్రహాల్లో ఆరు శుభగ్రహాలుగా ఉన్నాయి. కనుక సకల శుభాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కలుగుతాయి’’ అని తెలిపారు.

  • Loading...

More Telugu News