: మీ అందరికీ మంచి జరగాలి: శ్రీలంక తమిళులకు రజనీకాంత్ లేఖ


శ్రీలంక తమిళులకు అంతా మంచే జరగాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన వారికి ఓ లేఖ రాశారు. సమయం వచ్చినప్పుడు అందరం కలుసుకుందామని లేఖలో ఆయన పేర్కొన్నారు. శ్రీలంక ప్రజలను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని మనసు ఉవ్విళ్లూరుతోందని ఆయన అన్నారు. తన పట్ల చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీలంకలోని తమిళుల కోసం 150 ఇళ్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు రజనీ జాఫ్నాకు వెళ్లాల్సి ఉంది. కానీ, రజనీ అక్కడకు వెళితే శ్రీలంక తమిళులపై దాడులు జరిగే అవకాశం ఉందని... అందువల్ల అక్కడ పర్యటించవద్దని వీసీకే చీఫ్ తిరుమావలవన్, ఎండీఎంకే చీఫ్ వైగో తనను కోరినట్టు ఓ ఇంటర్వ్యూలో రజనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News