: హీరో నానికి ఈరోజు రెండు పండుగలు... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నాని భార్య
నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న టాలీవుడ్ యంగ్ హీరో నాని... రియల్ లైఫ్ లో కూడా ప్రమోషన్ పొందాడు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఆయన భార్య అంజన పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో, నాని కుటుంబంలో ఈరోజు రెండు పండుగలు జరుపుకుంటున్నారు. సినీ రంగంలో అడుగుపెట్టక ముందు ఆర్జేగా పని చేస్తున్న రోజుల్లోనే అంజనతో ప్రేమలో పడ్డాడు నాని. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2012లో వీరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం 'నిన్ను కోరి' సినిమా షూటింగ్ తో నాని బిజీగా ఉన్నాడు.