: స్టేట్ బ్యాంకులో విలీనం దరిమిలా.. ఏప్రిల్ 1 నుంచి ఐదు బ్యాంకులు మాయం.. 1600 శాఖల మూత!


స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల.. ఈ ఐదు బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి మాయం కానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బ్యాంకులన్నీ మాతృసంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)లో విలీనం కానున్నాయి. అయితే అనుబంధ బ్యాంకుల విలీనానికి మూడు నెలలు పడుతుందని ఎస్‌‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి విలీనం లాంఛనంగా అమల్లోకి వచ్చినా పూర్తిస్థాయిలో విలీనానికి మూడు నెలలు పడుతుందని స్పష్టం చేశారు. ఈ విలీనం కారణంగా 1,600 శాఖలు మూతపడతాయని తెలిపారు. విలీనం తర్వాత ప్రపంచంలోనే మేటి బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ నిలుస్తుందని రజనీష్ కుమార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News