: అమరావతి భూసమీకరణపై హార్వర్ట్ యూనివర్సిటీతో అధ్యయనం చేయిస్తే బాగుంటుంది సార్!: చంద్రబాబుతో అధికారులు
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్‌కు ఒక్క పిలుపుతో రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఆర్‌డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క పిలుపు ఇవ్వగానే రైతులు ఏకంగా 34 వేల ఎకరాలను భూసమీకరణ విధానంలో ఇచ్చి మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన అధికారులు, భూసమీకరణ విధానంపై ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీతో ప్రత్యేకంగా అధ్యయనం చేయిస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపదుతున్నారని అన్నారు.