: తీర్చలేని అప్పుల్లో తెలంగాణ.. కాగ్ నివేదిక చెప్పిందన్న తమ్మినేని


తెలంగాణ రాష్ట్రం తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా కాగ్ నివేదిక బయటపెట్టిందన్నారు. బడ్జెట్‌లో మిగులు నిధులు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ముమ్మాటికీ అబద్ధమేనని కాగ్ నివేదిక ద్వారా రుజువైందన్నారు. రుణాలు లభించకపోతే లోటు బడ్జెట్ అవుతుంది తప్ప మిగులు బడ్జెట్ కాదని కాగ్ చెప్పిందని వీరభద్రం అన్నారు. కాగ్ నివేదికను అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కాగ్ నివేదికపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News