: కేవలం మూడున్నర అడుగుల మానవులు కనిపించారు... మీరూ చూడండి!
భూమి మీద అరుదైన జాతులు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని రకాల జాతులకు చెందిన మానవులు కూడా అరుదైన జాతుల కిందకే వస్తారు. తాజాగా ఇండోనేషియాలో కేవలం మూడున్నర అడుగుల పొడవు ఉండే పిగ్మీ లేదా మాంటే అనే తెగ మానవులు కనిపించడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఇండొనేషియా ప్రాచీన సాహిత్యంలో మూడున్నర అడుగుల మనుషుల ప్రస్తావన ఉంది. వారిని మాంటే తెగకు చెందిన వారిగా సాహిత్యకారులు అభివర్ణించారు. 17 శతాబ్దంలో మాంటె తెగకు చెందిన ఇద్దర్ని పట్టుకుని, అప్పటి సుల్తాన్ కు బహుమతిగా ఇచ్చారని చరిత్ర చెబుతుంది.
అయితే తాజాగా ఇండోనేషియాలోని ఓ అడవిలో బైక్ రేసర్లు బాండా అఖే ప్రాంతం వద్దకు చేరుకోగానే... వారికి పిగ్మీ తెగకు చెందిన ఓ మానవుడు అర్ధనగ్నంగా, చేతిలో కర్ర పట్టుకొని కనిపించాడు. చిన్న మనిషిని చూసిన రైడర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసి, ఏలియనా? అన్న అనుమానంతో చూసేలోపు పరుగందుకున్నాడు. ఇంతలో మరొక రైడర్ బైక్ పై అతడిని వెంబడించాడు. ఆ పిగ్మీ మానవుడు మట్టిరోడ్డుపై పరిగెత్తుతూ రెల్లుగడ్డిలోకి దూరిపోయాడు.
అసలే పొట్టిమనిషి, ఏపుగా పెరిగిన రెల్లు గడ్డి.. అంతే.. ఎక్కడున్నాడో కూడా వారికి అర్ధం కాలేదు. వెతికి వెతికి విసిగిపోయారు. బైక్ కు ఉండే వీడియోలో ఇది రికార్డు కావడంతో దానిని వారు సోషల్ మీడియాలోపెట్టారు. హాలీవుడ్ సినిమా ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’లో వీరిని హబ్బిట్స్ను గా చూపించారు. వీరు సాధారణంగా అడవుల్లోనే రహస్యంగా ఉంటారని, సాధారణ మనుషులను చూస్తే పారిపోతారని ప్రాచీన సాహిత్యం చెబుతోంది. అందులో కూడా వీరి గురించి చరిత్రలో చాలా తక్కువ సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.