: బీహార్ లో ఆసక్తికర పరిణామాలకు తెరతీసిన నితీష్ కుమార్ విందు!


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇచ్చిన విందు అక్కడ పెను రాజకీయ కలకలానికి కారణమైంది. ఈ విందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ కనిపించగా, నితీష్ మిత్రపక్షం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే ఈ విందులో లాలూ ఇద్దరు కుమారులు, తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్ లు కనపించడం విశేషం.

సుశీల్ మోదీ ఈ విందులో పాల్గొనగా, ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు విందుకు డుమ్మా కొట్టారు. దీనిపై సుశీల్ మోదీ స్పందిస్తూ, 'ఒక విందు కోసం పార్టీ విప్‌ను జారీచేయలేదు కదా? ఒక ఆహ్వాన్నాన్ని మన్నించాలా? వద్దా? అన్నది వ్యక్తిగత అభీష్టం' అన్నారు. దీంతో నితీష్ మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో బీహార్ లో రాజకీయాలు మారుతున్నాయంటూ అక్కడి వార్తాపత్రికలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. వాటిని నేతలు కొట్టిపడేస్తున్నారు. 

  • Loading...

More Telugu News