: ‘రోబో 2.0’ రిలీజ్ గురించి అడిగితే లతా రజనీకాంత్ అలా చెప్పారు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘రోబో 2.0’ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందనే ప్రశ్నకు ఆయన భార్య లతా రజనీకాంత్ ‘వెయిట్ అండ్ సీ’ అని సమాధానం చెప్పారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఐఫా అవార్డ్స్ వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా పలుకరించింది. తెలుగులో చెప్పడం రాదంటూ ఇంగ్లీషులో ఆమె మాట్లాడారు.
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ అంతా ఇక్కడ కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని, తన భర్త, తన ఫ్యామిలీ తరపున అందరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నానని అన్నారు. ఐఫాలో ‘కబాలి’ సినిమాకు చాలా నామినేషన్స్ ఉన్నాయి కదా!..దీని గురించి మీరు ఏం చెబుతారని ప్రశ్నించగా, ‘అందరికీ అవార్డ్స్ రావాలని నేను కోరుకుంటున్నాను’ అని సమాధానమిచ్చారు.