: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా!
2016-17 క్రికెట్ సీజన్ ను విజయవంతంగా ముగించి, నెంబర్ వన్ గా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టెస్టుల్లో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడికి 50 లక్షల రూపాయల చొప్పున నజరానా అందజేయనున్నట్టు తెలిపింది. టీమిండియా చీఫ్ కోచ్ కు 25 లక్షల రూపాయలు, ఇతర సహాయ సిబ్బంది ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున అందజేయనున్నట్టు ప్రకటించింది. టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా నిలిచిన భారత జట్టును సముచిత రీతిలో సత్కరించాలని భావించిన బీసీసీఐ ఈ నజరానా ప్రకటించినట్టు తెలిపింది. కాగా, వరల్డ్ నెంబర్ వన్ గా నిలవడంతో జట్టుకు మిలియన్ డాలర్ల బహుమతిని ఐసీసీ అందజేసిన సంగతి తెలిసిందే.