: ఆటగాళ్లకు ట్విట్టర్ ద్వారా తమాషా అవార్డులిచ్చిన వీరేంద్ర సెహ్వాగ్


టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో పెట్టే ట్వీట్లు అభిమానులను విపరీతంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. సెహ్వాగ్ ట్వీట్ చేశాడంటే అది వైరల్ కావడం ఖాయం అన్నట్టుగా ఆయన ట్వీట్లు చేస్తుంటాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న అనంతరం ట్విట్టర్ కింగ్ సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేసి అలరించాడు. ఈ ట్వీట్ లో ఏమన్నాడంటే... ఎట్టకేలకు హోం సీజన్ ముగిసింది. వీరూ ఘరేలూ అవార్డులకి సమయం అసన్నమైంది.. అన్నాడు.
పుజారా...ఇన్వర్టర్
జడేజా...తుల్లు పంప్
కేఎల్. రాహుల్...స్టెబిలైజర్
స్టీవ్ స్మిత్... ట్యూబ్ లైట్
అంటూ ట్వీట్ చేశాడు.

 దీని అంతరార్థమేమిటంటే... పుజరా జట్టుకు అవసరమైనప్పుడు, ఇతరులు ఆడనప్పుడు జట్టుకు అవసరమైన పరుగులు చేశాడు. దీంతో విద్యుత్ (కీలక ఆటగాళ్లు ఆడనప్పుడు) ఇన్వర్టర్ (పుజారా) లా ఉపయోగపడ్డాడని తెలిపాడు. కేఎల్.రాహుల్ సిరీస్ ఆద్యంతమూ నిలకడగా ఆడాడు. దీంతో అతనిని స్టెబిలైజర్ తో పోల్చాడు. ఇక జడేజా తుల్లు పంప్ నీటిని ఎలా ఊడ్చి పడేస్తుందో...అలాగే ఆసీస్ బ్యాట్స్ మన్ వికెట్లు తీశాడని సెహ్వాగ్ తెలిపాడు. ఇక డీఆర్ఎస్ వివాదం అనంతరం ఆ సమయంలో తన బుర్ర పని చేయలేదని, అందుకే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశానని స్మిత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో స్మిత్ బుర్ర ట్యూబ్ లైట్ లా పని చేస్తుందని సింబాలిక్ గా చెప్పాడు.








  • Loading...

More Telugu News