: మహిళలపై కేరళ పీసీసీ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు.. దుమారం!


గాడ్స్ ఓన్ కంట్రీగా, విద్యాధికులు అధికంగా గల రాష్ట్రంగా నిలిచిన కేరళలో వివక్ష తీవ్ర రూపుదాలుస్తోంది. కేరళ పీసీసీ చీఫ్ గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఎంఎం హసన్ మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఉమెన్ చాందీ పట్టుబట్టి మరీ ఆయనకు పదవి అప్పగించిన కాసేపటికే ఆయన 'రుతుస్రావం అనేది మలినమైనది. ఈ సమయంలో మహిళలను ఆలయాల్లోకి రానివ్వకూడదు. ఈ సమయంలో మహిళలకు రాకూడదన్న సూచన వెనుక సైంటిఫిక్‌ కారణం ఉంది. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదు. ఈ సమయంలో మహిళలు ఉపవాసం ఉండకూడదు. నా అభిప్రాయం ప్రకారం మహిళల శరీరం మలినంగా ఉన్నప్పుడు వారు ఆలయాలు, మసీదులు, చర్చిల వంటివాటికి వెళ్లకపోవడమే మంచిది' అంటూ ఆయన వ్యాఖ్యానించడం పెను కలకలం రేపుతోంది. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 

  • Loading...

More Telugu News