: ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లలో జరిగిన చోరీల వివరాలు వెల్లడించిన కేంద్ర సర్కారు
ఢిల్లీలో గత మూడేళ్లలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో చోరీలకు సంబంధించి 73 కేసులు నమోదయ్యాయని లోక్‌సభలో హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ అన్ని కేసుల్లో విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు 26 మందిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. 2014లో ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో 25 దొంగతనం కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2015లో 29 కేసులు నమోదు కాగా, ఇక గత ఏడాది 19 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఢిల్లీలో వీఐపీలుండే అన్ని ప్రాంతాల్లోను భద్రత కోసం నిత్యం పెట్రోలింగ్, పోలీసుల పహారా ఉంటుందని చెప్పారు.