: చైనాతో పాక్ అప్ర‌మ‌త్తంగా ఉండాలి: అమెరికాలో పాకిస్థాన్ మాజీ రాయ‌బారి


పాకిస్థాన్ ప‌ట్ల చైనా సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న ధోర‌ణిపై అమెరికాలో పాక్‌ రాయబారిగా పనిచేసిన జహంగీర్ ఖాజీ తాజాగా స్పందిస్తూ త‌మ దేశానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. చైనా విషయంలో పాక్‌ అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు. అమెరికా, భారత్‌లతో విభేదాలను దృష్టిలో పెట్టుకొనే పాక్‌తో చైనా స‌త్సంబంధాలు పెట్టుకుంటుంద‌ని తేల్చి చెప్పారు. అలాగే, పాకిస్థాన్‌ తన అంతర్గత సమస్యలను తానే పరిష్కరించుకోవాలని స‌ల‌హా ఇచ్చారు.

పాకిస్థాన్ సమస్యలను చైనా ఎప్పుడూ తనదిగా భావించబోద‌ని చెప్పారు. అమెరికా విదేశీ విధానం, డొనాల్డ్‌ ట్రంప్‌ పాలన అనే అంశంపై నిర్వ‌హించిన సమీక్షలో ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. హిందూ మహా సముద్రంతో పాటు యావత్‌ ఆసియా ఖండంలోనూ ప్రధాన శక్తిగా చైనా ముందుకొస్తున్నప్పటికీ ఆ దేశం ఏ దేశాన్ని సవాల్‌ చేయడం లేదని జ‌హంగీర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చైనాను డొనాల్డ్‌ ట్రంప్‌ ఎలా ఎదుర్కొంటారన్నది చూడాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News