: సీన్ రివర్స్... హెల్మెట్ ధరించనందుకు పోలీసులకు జరిమానా వేయించిన ప్రజలు!


రోడ్డు నిబంధనలు పాటించకుండా వెళ్లే వాహనదారులకు పోలీసులు జరిమానా విధించే దృశ్యాలు ప్ర‌తిరోజు మ‌నం చూస్తూనే ఉంటాం. అయితే, నిబంధ‌న‌లు త‌మ కోసం కాదు వేరే ప్ర‌జ‌ల కోస‌మే అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తించిన పోలీసుల‌కు కోల్‌క‌తాలోని న‌దియ జిల్లాలో ప్ర‌జ‌లు జ‌రిమానా విధించారు. ద్విచ‌క్ర వాహ‌నంపై హెల్మెట్ పెట్టుకోకుండా వెళుతున్న పోలీసుల‌ను గ‌మ‌నించిన అక్క‌డి ప్ర‌జ‌లు వారికి తెలిసొచ్చేలా చేశారు. నలుగురు పోలీసులు రెండు బైక్‌లపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుండ‌డంతో ప్రజలు పోలీసుల బైక్‌లను ఆపి, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నేరమని చెప్పారు. దీంతో పోలీసులు ప్రజలతో వాగ్వివాదానికి దిగారు. ఇదే ప‌ని తాము చేస్తే త‌మ‌కు జ‌రిమానా విధిస్తార‌ని, తమకో న్యాయం... పోలీసుల‌కో న్యాయమా? అని ప్ర‌జ‌లు ప్రశ్నించారు. అనంత‌రం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి రూ. 100 చొప్పున జరిమానా వేయించారు.

  • Loading...

More Telugu News