: తమ సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఎంపీకి మరోసారి షాకిచ్చిన ఎయిరిండియా
శివసేన పార్టీకి చెందిన ఎంపీ గైక్వాడ్ ను విమానాలు ఎక్కనీయబోమని విమానయాన సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఎంపీల నుంచి వస్తోన్న ఒత్తిడితో ఆ సంస్థలు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా నిబంధనలు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా గైక్వాడ్‌కు ఎయిరిండియా మరోసారి షాక్ ఇచ్చింది. తాజాగా గైక్వాడ్ ముంబై నుంచి న్యూఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, ఆయనపై ఇప్పటికే నిషేధం విధించిన ఎయిరిండియా ఆ టికెట్‌ను రద్దు చేసింది. సదరు ఎంపీ ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన అనంతరం ఆయన ఢిల్లీ నుంచి పుణెకు బుక్ చేసుకున్న టికెట్‌ను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.