: యూపీలో రైల్వే స్టేషన్ సమీపంలో బాంబు పేలుడు... తనిఖీల్లో మూడు బాంబులు లభ్యం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖలీలాబాద్ ప్రాంతంలో బాంబుల కలకలం రేగింది. ఈ రోజు ఉదయం రాజు తప్పా అనే వ్యక్తి రైల్వే పట్టాల సమీపంలో చెత్త సేకరిస్తుండగా ఓ బాంబు పేలింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులకు తనిఖీల్లో మూడు బాంబులు లభించాయి. ఆ బాంబులన్నీ తక్కువ తీవ్రతతో ఉన్నాయని, రాజు సేకరించిన చెత్తలోని ఓ బ్యాగులో ఇవి దొరికాయని చెప్పారు. రాజుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.