: గంటా, నారాయణలను బర్తరఫ్ చేయండి.. లేదా మీరు రాజీనామా చేయండి: బాబును డిమాండ్ చేసిన రోజా
మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యల్లో కూడా నారాయణ విద్యాసంస్థలే నంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలతో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అవుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీరిద్దరినీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, జరుగుతున్న దారుణాలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని అన్నారు.