: ఎర్రబెల్లి దయాకరరావు ఇంటికి వెళ్లిన కేటీఆర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఎర్రబెల్లి తల్లి ఆదిలక్ష్మి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్, ఆయనను పరామర్శించారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న ఎర్రబెల్లి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబీకులందరినీ పరామర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో, ఆయన ఎర్రబెల్లి నివాసానికి వెళ్లారు.