: నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్


నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్ల మధ్య దూషణల పర్వం కొనసాగిన సంగతి తెలిసిందే. డీఆర్ఎస్ విషయంలో ఇండియా కెప్టెన్ కోహ్లీతో ఆసీస్ కెప్టెన్ స్మిత్ పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. చివరి టెస్టు సందర్భంగా కూడా మురళీ విజయ్ ను స్మిత్ దూషించాడు. ఆసీస్ ఇతర ఆటగాళ్లు కూడా స్మిత్ వైఖరినే అవలంబించారు.

ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్ లో ఓటమిపాలైన తర్వాత స్మిత్ మాట్లాడుతూ సిరీస్ అంతా గొడవలు, వివాదాలతోనే గడిచిపోయిందని అన్నాడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో తాను విఫలమయ్యానని చెప్పాడు. ఇందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు. భారత క్రికెటర్లు ముఖ్యంగా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారని అన్నాడు. ఆసీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News