: అత్యంత కఠినంగా మోదీ, అటూ ఇటుగా యోగి... తొమ్మిది రోజుల పాటు ఒకే వ్రతం చేయనున్న నేతలు


ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు ఒకే వ్రతాన్ని ప్రారంభించారు. స్వతహాగా శక్తి మాత భక్తులైన వీరు, చైత్ర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, 9 రోజుల పాటు నియమ నిష్టలతో ఉపవాస దీక్ష ప్రారంభించారు. ఈ 9 రోజుల్లో వీరిద్దరూ కేవలం నిమ్మరసాన్ని మాత్రమే స్వీకరించనున్నారు. ఈ దీక్ష చేయడం వల్ల దుర్గామాత ఆశీస్సులు లభిస్తాయని మోదీ గట్టిగా నమ్ముతారన్న సంగతి తెలిసిందే.

 2014లో లోక్ సభ ఎన్నికల సమయంలోనూ మోదీ ఈ దీక్ష చేపట్టారు. ఇక యూపీ సీఎం యోగి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వ్రత దీక్ష చేపడుతూ వస్తున్నారు. ఈ తొమ్మిది రోజులూ ఆయన శక్తి సాధన చేపడతారని, అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని అధికారులు తెలిపారు. కాగా, మోదీ అంత కఠోర ఉపవాస దీక్షను యోగి చేయడం లేదని, ఆయన పళ్ళు, పాలు స్వీకరిస్తారని ఆయన అనుచరులు తెలిపారు. 'నాథ్' సంప్రదాయాన్ని పాటించే యోగి చైత్ర దీక్షలో ఎనిమిదో రోజు జరిగే కన్యా పూజ ప్రధానమైనది. ఈ సంవత్సరం ఆయన వ్రతం లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఉన్న అధికారిక నివాసంలోనే జరుగనుంది.

  • Loading...

More Telugu News