: పవన్ కల్యాణ్ ఆహ్వానాన్ని అందుకుని జనసేనలో చేరాలంటే... ఇలా చేయాలి!
తన పార్టీలో ప్రసంగీకులు, రైటర్లు, విశ్లేషకులను ఆహ్వానిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను పార్టీ అధికార వెబ్ సైట్ 'https://janasenaparty.org'లో ఉంచారు. ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన తరువాత ఎడమవైపు 'రిసోర్స్ పర్సన్స్' అన్న లింకును క్లిక్ చేస్తే, దరఖాస్తు ప్రొఫార్మా లభిస్తుంది. దీన్ని ఆన్ లైన్ లోనే నింపి సబ్ మిట్ చేయాల్సి వుంటుంది. పేరు, ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారు, ఏజ్, జండర్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ప్రొఫెషన్, క్వాలిఫికేషన్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం వివరాలను నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై జిల్లాకు వచ్చే జనసేన ప్రతినిధుల ముందు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి వుంటుంది.