: దరిద్రమైన భోజ‌నం.. బీఫ్‌ ఉందనుకుని తిన్నా.. అది ఎలుక మాంసం!: జేమ్స్ బాండ్ హీరో


జేమ్స్‌బాండ్‌ చిత్రాల ద్వారా ప్ర‌ముఖ ఐరిష్ న‌టుడు పియర్స్‌ బ్రొస్నాన్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన విష‌యం తెలిసిందే. అటువంటి న‌టుడు తాను ఎదుర్కున్న ఓ వికార‌మైన అనుభ‌వాన్ని గురించి ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రించి చెప్పారు. ‘మిస్టర్‌ జాన్సన్‌’ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఇటీవ‌ల నైజీరియా వెళ్లిన సందర్భంగా అక్క‌డి ఓ పట్టణంలోని హోటల్‌కు వెళ్లానని చెప్పారు. అయితే, అక్కడ త‌న‌కు సర్వ్‌ చేసిన ఆహారంలో బీఫ్‌ ఉందనుకుని తిన్నానని, అయితే, అందులో ఎలుక మాంసం ఉండటం గుర్తించాన‌ని అన్నారు. అది తిన్న తర్వాత తాను వారం రోజుల పాటు అస్వస్థతకు గురయ్యానని పేర్కొన్నారు. తాను అంతటి దరిద్రమైన భోజ‌నం ఇంతకుమునుపెన్నడూ తినలేదని అన్నారు.

  • Loading...

More Telugu News