: మహిళల వేషంలో కోర్టుకు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు... ఒకరి మృతి
జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళల వేషంలో వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ కాల్పులు జరిపి పారిపోయిన ఘటన హరియాణాలోని రోహ్‌తక్ జిల్లాలో అలజడి రేపింది. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఓ కేసు విచారణ నిమిత్తం గ్యాంగ్‌స్టర్ రమేశ్ లోహార్, అతడి అనుచరులను పోలీసులు రోహ్‌తక్ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. సదరు గ్యాంగ్ స్టర్ కోసం కోర్టు ప్రాంగణంలో మహిళల వేషంలో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు అప్పటికే మాటు వేశారని, రమేశ్‌ని అక్కడకు తీసుకురాగానే కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.