: నైజీరియన్లపై దాడి విషయంపై.. యూపీ ముఖ్యమంత్రికి సుష్మాస్వరాజ్ ఫోన్‌!


గ్రేట‌ర్ నోయిడాలో ఇటీవ‌లే నైజీరియాకు చెందిన విద్యార్థులపై ఓ గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విష‌యం తెలిసిందే. అక్క‌డి ప్రాంతంలో డ్రగ్స్‌ బారిన పడి భార‌తీయ విద్యార్థి మనీశ్‌ చనిపోయాడని, అందుకు నైజీరియన్లే కారణం అని వారిపై ఈ దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు నైజీరియన్లకు గాయాలై వారు ఆసుప‌త్రిలో చికిత్స  పొందుతున్నారు. త‌మవారిపై దాడి జ‌రిగిన అంశంపై నైజీరియా విద్యార్థులు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేయ‌డంతో ఆమె ఈ విష‌య‌మై ఉత్త‌ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు ఫోన్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తగిన భరోసా ఇచ్చారని, విద్యార్థులపై దాడి ఘటన విషయంలో నిష్పక్షపాతమైన, న్యాయబద్ధమైన విచారణ జరిపిస్తామని చెప్పారని సుష్మాస్వ‌రాజ్‌ అన్నారు. దాడికి గురైన ఆఫ్రికన్‌ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News