: బ్రాహ్మణ సంఘం రూపొందించిన కొత్త సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన జగన్
గుంటూరు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కొత్త సంవత్సర పంచాంగాన్ని వైసీపీ అధినేత జగన్ ఆవిష్కరించారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ పంచాంగాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంపెంగ మాలను వేదపండితులు జగన్ కు అందించారు. అంతేకాదు, సుమతీ శతకంతో ఉన్న రజత ఫలకాన్ని అందజేశారు. కొత్త తెలుగు సంవత్సరంలో ప్రజలకు జగన్ మరింత చేరువ కావాలని ఈ సందర్భంగా వారు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాశజ్జుల పురుషోత్తమ శర్మ, యేలేశ్వరపు జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.