: అమెరికా - రష్యాల మధ్య త్వరలోనే అత్యంత భయంకరమైన యుద్ధం జరగబోతోంది: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు


త్వరలోనే అమెరికా - రష్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరగబోతోందని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చినే సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోతున్న ఈ భయంకర యుద్ధంలో అత్యంత శక్తిమంతమైన యుద్ధ సామాగ్రిని ఉపయోగిస్తారని చెప్పారు. 'ఎంటర్ టైన్ మెంట్ గ్లోబల్ సమ్మిట్'లో ప్రసంగించిన ఆయన ప్రపంచీకరణ నేపథ్యంలో జాతీయ భద్రతకు ఉన్న ఆపదల గురించి మాట్లాడారు. రష్యా అమెరికాకు పెను ముప్పుగా పరిణమిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నాటో బలగాలను బలహీనపరిచేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, ఇరాన్, సిరియాలలో ఇప్పటికే రష్యా పాగా వేసిందని చెప్పారు.

అణుపరీక్షలకు గతంలోని ఒబామా ప్రభుత్వం తక్కువ నిదులను కేటాయించిందని... దీంతో, అమెరికా బలహీనంగా తయారయిందని డిక్ చినే అన్నారు. ఇదే సమయంలో అమెరికా వ్యతిరేక శక్తులు పుంజుకున్నాయని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను సైబర్ వార్ ద్వారా రష్యా ప్రభావితం చేయడం... యుద్ధానికి రెచ్చగొట్టే ప్రయత్నమే అని చెప్పారు. సీనియర్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిక్ చినే ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

  • Loading...

More Telugu News