: ముస్లింలు గొడ్డు మాంసం తినడం మానేయాలి: ఆజం ఖాన్ ఆసక్తికర వ్యాఖ్య


ఉత్తరప్రదేశ్ లోని కబేళాలను ముఖ్యమంత్రి యోగి మూసివేయించడాన్ని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ తప్పుబట్టారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కబేళాలను ఎందుకు మూసేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా వీటిపై నిషేధం విధించాలని... దేశమంతా ఒకటే చట్టం ఉండాలని అన్నారు. కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కబేళాలు నిర్వహించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేశారని ప్రశ్నించారు. లైసెన్స్ ఉన్న కబేళాలను మాత్రమే కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచన అనే విషయం అర్థంమవుతోందని.. అయితే, లైసెన్స్ ఉన్న, లైసెన్స్ లేని కబేళాలు అనే తేడా అనవసరమని... అన్నింటినీ మూసివేయించాలని డిమాండ్ చేశారు. ఏ జంతువునూ చంపవద్దని చెప్పారు. కొన్ని మతాల వారు కోడి, మేక కూడా తినరని... అదేవిధంగా ముస్లింలు కూడా గొడ్డు మాంసాన్ని తినడం మానేయాలని సూచించారు. 

  • Loading...

More Telugu News