: ఇక ప్రభాసే 'బాహుబలి' ఎలా అయ్యాడో చెబుతా!: రాజమౌళి


బాహుబలి ప్రభాస్ ను గురిచి మాట్లాడటానికి తనకిప్పుడు మాటలు రావడం లేదని దర్శకుడు రాజమౌళి అన్నాడు. ప్రభాసే ఎందుకు బాహుబలి అయ్యాడో, బాహుబలిలో అతడేంటో, సినిమా విడుదలవడానికి ముందే తానిచ్చే ఇంటర్వ్యూలలో చెబుతానని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేదికగా రాజమౌళి ట్వీట్ చేశాడు. తన ఇంటర్వ్యూల్లో బాహుబలి పాత్రకు ప్రభాస్ ను ఎందుకు ఎంపిక చేశామన్న విషయం నుంచి, ఈ పాత్ర కోసం అతను పడ్డ కష్టాన్ని గురించి చెబుతానని అన్నాడు. ప్రీ ఈవెంట్ రిలీజ్ వేడుకకు వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అనిల్ తడానీలకు కృతజ్ఞతలు చెప్పాడు. బాహుబలి బ్రాండ్ ప్రపంచ నలుమూలలకూ విస్తరించేందుకు తమ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ 'ఆర్కా కనెక్ట్' అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అన్నాడు.

  • Loading...

More Telugu News