: క్రెడిట్ కార్డుల మోసాల కేసులో ఇద్దరు భారతీయ అమెరికన్లకు జైలు శిక్ష!
భారీ ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇద్దరు భారతీయ అమెరికన్లకు జైలు శిక్ష పడింది. విజయ్ వర్మ (49), తర్సీం లాల్ (78) అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు 200 మిలియన్ డాలర్ల క్రెడిట్ కార్డు మోసానికి పాల్పడ్డారు. దీంతో, కోర్టు వీరికి 14 నెలల జైలు శిక్షతో పాటు, ఐదు వేల డాలర్ల జరిమానాను విధించింది.
వీరిద్దరూ న్యూజెర్సీలో ఓ జ్యువెలరీ స్టోర్ ను నిర్వహిస్తున్నారు. 2013లో ఓ ప్లాన్ ప్రకారం 7000 తప్పుడు అడ్రస్ ప్రూఫ్ లు పెట్టి దాదాపు వేల సంఖ్యలో క్రెడిట్ కార్డులు రాబట్టారు. ఆ క్రెడిట్ కార్డులను తమ స్టోర్ లోనే ఉపయోగించి, క్రెడిట్ లిమిట్ మొత్తం తమ ఖాతాల్లోకి వచ్చేలా చేశారు. ఈ విధంగా దాదాపు 200 మిలియన్ డాలర్లు వారి ఖాతాల్లోకి జమ అయ్యాయి. ఆ తర్వాత అప్పును చెల్లించేందుకు కార్డుదారులు ముందుకు రాకపోవడంతో అసలు బండారం బయటపడింది. విచారణలో వీరిద్దరే క్రెడిట్ కార్డులు సృష్టించి, డబ్బును కాజేసినట్టు తేలింది. దీంతో, వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా... 14 నెలల జైలు శిక్షతో పాటు, 12 నెలల గృహ నిర్బంధం శిక్షను కోర్టు ఖరారు చేసింది.