: లలిత్ మోదీ అప్పగింతపై భారత్ విన్నపాన్ని తిరస్కరించిన ఇంటర్ పోల్!


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పలు మార్లు సమన్లు జారీ చేసినా, తప్పించుకు తిరుగుతున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మాజీ చైర్మన్ లలిత్ మోదీని అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని ఇంటర్ పోల్ తిరస్కరించింది. ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్న లలిత్ మోదీ, తాను ఇండియాకు వెళితే ప్రాణహాని ఉందని, అందువల్ల విచారణకు రాలేనని చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను తమకు అప్పగించాలని ఇంటర్ పోల్ ను ఇప్పటికే పలుమార్లు భారత్ అధికారికంగా కోరింది. ఇప్పుడు ఇంటర్ పోల్ భారత వినతిని తిరస్కరించడంతో, ఆయన ప్రస్తుతానికి అరెస్ట్ నుంచి తప్పించుకున్నట్టే.

  • Loading...

More Telugu News