: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే.. ఎంతటివాడైనా సరే ఊరుకోను: చంద్రబాబు
పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయిన వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం నివేదికను తనకు సమర్పించాలని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే, ఎంతటివాడైనా సరే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇలాంటి వ్యవహారాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని... ఇకపై ఇలాంటివి చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు.