: మీరు ఓడిపోయాక డిన్నర్ చేద్దాం.. సరేనా!: ఆసీస్ ఆటగాడితో జడేజా


ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో నాలుగో రోజు మైదానంలో ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఆస్ట్రేలియా ఆటగాడు వేడ్, భారత్ క్రికెటర్ జడేజాలు పరస్పరం వాదనలకు దిగారు. జడేజా హాఫ్ సెంచరీ తరువాత మొదలైన గొడవ, ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో వేడ్ అవుటయ్యేంత వరకూ సాగింది. ఆట ముగిసిన తరువాత వేడ్ కూ, తనకూ మధ్య జరిగిన సంభాషణను జడేజా బయటపెట్టాడు.

వేడ్ అవుటైన తరువాత, ‘ఏమీ లేదు. మీరు ఓడిపోయాక అంతా కలిసి డిన్నర్‌ చేద్దాం’ అని తాను చెప్పినట్టు అన్నాడు. అంతకుముందు జడేజా హాఫ్ సెంచరీ తరువాత తన ట్రేడ్ మార్క్ మూమెంట్ ను చూపించగా, హేడ్ అవహేళనగా మాట్లాడుతూ, ఇన్ స్టాగ్రామ్ లో ఇలాంటి చెత్తనే జడేజా నిర్వహిస్తుంటాడని అన్న సంగతి తెలిసిందే. ఆపై జడేజా అంపైర్లకు కూడా ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News