: వరుసగా ట్వీట్ల వర్షం కురిపిస్తూ, మనసులో మాటలు చెప్పిన రాజమౌళి!


నిర్దేశిత సమయం పూర్తి కావస్తుండడంతో, త్వరగా కార్యక్రమాన్ని ముగించాలని పోలీసులు కోరడంతో మొన్న జరిగిన 'బాహుబలి: ది కన్ క్లూజన్' ప్రీ రిలీజ్ వేడుకలో తాను అనుకున్నది మాట్లాడలేకపోయిన దర్శకుడు రాజమౌళి, ట్విట్టర్ వేదికగా, ట్వీట్ల వర్షం కురిపించారు. తన మనసులో ఉన్న భావాలన్నీ చెప్పుకొచ్చారు. ఎంతమంది ప్రేక్షకులు వచ్చినా, ఎవరికీ ఇబ్బంది కలుగకుండా, మర్యాదగా అందరినీ హ్యాండిల్ చేసిన జీ4ఎస్ బృందానికి రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజ్ క్రాఫ్ట్ ఎంతో పకడ్బందీగా నిర్వహించిందని అన్నారు. గత ఐదేళ్లలో తాను ఏది అడిగితే దాన్ని సమకూర్చిన యోగానంద్ కు, అద్భుతమైన చిత్రం తయారు కావడానికి సహకరించిన వీఎఫ్ఎక్స్ విభాగాన్ని గుర్తు చేసుకున్నారు. అనుష్కను 'స్వీటీ' అని సంబోధిస్తూ, తన చిత్రంలో నటించినందుకు పొగడ్తల వర్షం కురిపించారు. మొదటి భాగంలో అనుష్కను అందంగా చూపించలేకపోయానని, రెండో భాగంలో ఆమెను చూసి అభిమానులు ఆనందిస్తారని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News