: టెన్త్ విద్యార్థులకు ఊరట.. ఫిజిక్స్‌లో నాలుగు గ్రేస్ మార్కులు


పదో తరగతి ఫిజిక్స్ ప్రశ్నపత్రంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. నాలుగు గ్రేస్ మార్కులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫిజిక్స్ ప్రశ్నపత్రంలో సీనియర్ ఇంటర్ సహా సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలివైన విద్యార్థులు సైతం ఆ పేపర్ రాయడం కష్టమని నిపుణులు సైతం తేల్చి చెప్పడంతో స్పందించిన పాఠశాల విద్యాశాఖ తప్పులను గుర్తించింది. తప్పిదాలపై సమీక్ష నిర్వహించి సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. 17-బి ప్రశ్నలో స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడిన విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఆర్‌. సురేంద్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రశ్నకు తప్పొప్పులతో సంబంధం లేకుండా రాసిన ప్రతి ఒక్కరికి నాలుగు గ్రేస్ మార్కులు కలపనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News