: ఫ్రిడ్జ్ లో బొద్దింకలు.. అదేమిటని అడిగితే లాగి చెంపమీద ఒక్కటిచ్చిన హోటల్ సిబ్బంది!


సాధారణంగా టీ, లేదా కాఫీ కావాలంటే రోడ్డు పక్కనే ఉన్న ఏ దుకాణంలో తాగినా సరిపోతుంది. అయితే కాఫీలలో కాస్త వెరైటీ కోరుకున్నవారు, డబ్బులకు లెక్కలేని వారు, పరిశుభ్రతను కోరుకునే వారు మాత్రం ఖరీదైన హోటళ్లలో తాగుతారు. అలాగే కాఫీ కోసం 'కేఫ్ కాఫీ డే'కు వెళ్లిన ఇద్దరు మిత్రులకు చేదు అనుభవం ఎందురైంది. దాని వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్‌ రాజధాని జయపురలో కాఫీ తాగేందుకు నిఖిల్‌ ఆనంద్‌ సింగ్‌, అర్పణ్‌ వర్మ అనే ఇద్దరు స్నేహితులు కాఫీ డేకు వెళ్లారు.

 కాఫీ ఆర్డర్ ఇచ్చిన సందర్భంగా అక్కడే ఉన్న ఫ్రిడ్జ్ లోని బొద్దింకల గుంపును చూసి విస్తుపోయారు. దీంతో ఆ బొద్దింకలను వీడియో తీశారు. దీంతో అక్కడే ఉన్న ఒక మహిళా సిబ్బంది ఆగ్రహంతో వచ్చి అతని చెంపపై లాగి ఒక్కటిచ్చింది. దీంతో బాధితులు దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతో స్పదించిన హోటల్ యాజమాన్యం ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ వీడియోను మీరు కూడా చూడండి.


  • Loading...

More Telugu News