: పోలీసులు అసెంబ్లీ రూల్స్ తెలుసుకుని ఉంటే బాగుండేది: 'చెవిరెడ్డి అరెస్టు'పై సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ గేటు ముందు ఈ రోజు ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కొన్ని గంటల అనంతరం ఆయన్నివదిలిపెట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అసెంబ్లీ ఆవరణలో చెవిరెడ్డి దీక్ష చేయడం తప్పని అన్నారు. అయితే, చెవిరెడ్డిని అదుపులోకి తీసుకునే ముందు స్పీకర్, చీఫ్ విప్ అనుమతి తీసుకుని ఉండాల్సిందని మండిపడ్డారు. అసెంబ్లీ నియమ నిబంధనల గురించి పోలీసులు తెలుసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. అంతేకాకుండా, పోలీసు అధికారుల సంఘాన్ని ‘తొక్కలో సంఘం’ అంటూ చెవిరెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని స్ట్రాటజీ కమిటీతో పాటు చంద్రబాబు తప్పుబట్టారు. 44 కేసులు ఉన్న చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సబబు కాదని అన్నారు.