: గ్రంథి సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన ‘క్రేన్’ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ రోజు పరామర్శించారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం జగన్ అమరావతి నుంచి గుంటూరు వెళ్లారు. గ్రంథి సుబ్బారావు కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. కాగా, గత శుక్రవారం గ్రంథి సుబ్బారావు మృతి చెందారు. ‘క్రేన్’ సంస్థ ద్వారా పలువురికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించారు.